సరుకులు ఉద్దెర ఇవ్వలేదని హత్య

సరుకులు ఉద్దెర ఇవ్వలేదని హత్య

కిరాణ షాపులో సరుకులు ఉద్దెర ఇవ్వలేదని కత్తితో దాడి చేసి హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ దారుణ ఘటన హైద్రాబాదు నగరంలో జరిగింది. హైదరాబాద్ రెహమత్ నగర్ వీడియో కాలనిలో పృద్వి కిరణ షాపు యజమాని. పృద్వి తన షాపులోని సరుకులు ఉద్దెర ఇవ్వలేదని డేవిడ్ అనే వ్యక్తి గొడవకు దిగాడు. పృద్వి ఈ గొడవపై రహ్మాత్ నగర్ లోని జూబ్లీహిల్స్ పీస్ ఔట్ పోస్ట్ పోలీసులకు పిర్యాదు చేసాడు. పోలీసులు పట్టించుకోకపోవడంతో.. ఆదివారం అర్ధరాత్రి డేవిడ్ మళ్లీ గొడవకు దిగాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో పృద్విపై దాడిచేసి హత్య చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.