వన్ ప్లస్ 6 ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

 వన్ ప్లస్ 6 ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

వన్ ప్లస్..ప్రస్తుతం మొబైల్ మార్కెట్ లో తనదైన శైలిలో అమ్మకాలను పెంచుకుంటూ యువతను బాగా ఆకర్షిస్తున్న ఫోన్. ఈ కంపెనీ నుండి ఓ నెల రోజుల క్రితం వన్ ప్లస్ 6 మోడల్ విడుదలైన సంగతి తెలిసిందే. అత్యాధునిక టెక్నాలిజీతో ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ తో రూపొందిన ఈ ఫోన్ అసలు హ్యాంగ్ అవ్వని డివైస్ గా వినియోగదారులను ఆకట్టుకుంది. మొదట్లో ఏ మోడల్ ను మిడ్ నైట్ బ్లాక్, మిర్రర్ బ్లాక్ కలర్స్ తో విడుదలైంది. 

కానీ తాజాగా ఈ మోడల్ ను రెడ్ కలర్ లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త మోడల్స్ అమ్మకాలు ఇండియాలో జూలై 16 నుండి ప్రారంభం కానున్నాయి. మాములుగా రెడ్ కలర్ అంటే కాస్త ఎక్కువమోతాదులోనే బ్రైటింగ్ ఉంటుంది. దానిని తగ్గించాడనికి ఆప్టికల్ కోటింగ్, ఏవాపరేటింగ్ ఫిలిం, ఆరు గ్లాస్ ప్యానెల్స్ తో ఈ కొత్త మోడల్ ను చేశారు. అలాగే దీనికి యాంటీ రిఫ్లెక్టీవ్ గ్లాస్ ను కూడా వాడారు కాబట్టి కాంతి కిరణం ఈ లేయర్స్ ద్వారా ప్రయాణించి రిప్లెక్ట్ అవ్వాలి. ఇందులో ఆరెంజ్ గ్లాస్ లేయర్ ను రెడ్ లేయర్ తో కలపడం వల్ల రేడియంట్ గ్లాసీ రెడ్ కలర్ వస్తుంది. ఇది వన్ ప్లస్ ను ఎంతో వైవిధ్యంగా చూపనుంది. ఇలా శాస్త్రీయ ప్రమాణాలతో  చాలా సింపుల్ గా, పవర్ ఫుల్ గా ఈ రెడ్ కలర్ వెర్షన్ ను తయారు చేశారు.