సరికొత్త టెక్నాలజీతో వన్ ప్లస్ 6

సరికొత్త టెక్నాలజీతో వన్ ప్లస్ 6
రోజుకో కొత్త మోడల్ మొబైల్ ఫోన్ విపణిలోకి విడుదలౌతున్నది.  ఎన్ని కొత్త మోడల్స్ వచ్చినా ఏ మొబైల్ హవా దానిదే.  చైనా మొబైల్ కంపెనీ నుంచి వన్ ప్లస్ 6 మొబైల్ మే16 వ తేదీన విడుదల కాబోతున్నది.  ఇప్పటికే వన్ ప్లస్ మొబైల్స్ వినియోగదారులకు ఆకట్టుకున్నాయి.  అదే తరహాలో ఇప్పుడు వస్తున్న వన్ ప్లస్ 6 కూడా ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.  వన్ ప్లస్ 6 లో వినియోగించిన కొత్త తరహా ఫీచర్లు తప్పకుండా అందరిని ఆకట్టుకుంటాయని కంపెనీ వర్గాలు చెప్తున్నాయి.  
ఇండియాలో మే 17 వ తేదీ నుంచి ఈ మొబైల్ అందుబాటులోకి వస్తుంది.  ఇక ఈ మొబైల్ లో ఉన్న ఫీచర్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం. 
లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 845 సిపియు, 
6/8 ర్యామ్ 
64/128/256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 
ఆండ్రాయిడ్ 8.1 ఒరియో. 
ఈ సంవత్సరంలో విడుదలయ్యే ఆండ్రాయిడ్ పి వర్షన్ తో అప్ గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది.
ఫ్రంట్ కెమెరా - 16 మెగాపిక్సల్ 
బ్యాక్ కెమెరా : 20 మెగాపిక్సల్ 
బ్యాటరీ : 3300 ఎంఏ హెచ్ 
ఇంటర్నల్ జీబీ సామర్ధ్యాన్ని బట్టి ధర ఉంటుందని కంపెనీ వర్గాలు చెప్తున్నాయి.  64 జీబీ ధర రూ.36,999/- కాగా, 128 జీబీ ధర రూ. 39,999/-, 256జీబీ ధర రూ.45,000/- గా ఉంటుందని తెలుస్తోంది.  
దేశంలోని 8 నగరాల్లో మొదట ఈ మొబైల్ అందుబాటులో ఉంటుందని కంపెనీ వర్గాలు చెప్తున్నాయి.  ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ స్టోర్లో ఈ మొబైల్ ఫోన్ అందుబాటులో ఉంటుంది.