జమ్ముకశ్మీర్: పూంఛ్ సెక్టార్ లో పేలుడు

జమ్ముకశ్మీర్: పూంఛ్ సెక్టార్ లో పేలుడు

జమ్ముకశ్మీర్ లోని పూంఛ్ సెక్టర్ లో సైన్యం శిక్షణ సందర్భంగా పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. పలువురు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఇదే సంఘటనకు సంబంధించి ఐఈడీ బ్లాస్ట్ లో ఒక జవాన్ మరణించినట్టు ఏడుగురు సైనికులకు గాయాలైనట్టు వార్తలు వచ్చాయి. అయితే 'ఇది ఐఈడీ పేలుడు కాదని, శిక్షణ సమయంలో జరిగిన ఘటన అని' రక్షణ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఇందులో ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డాడని, మరికొందరు జవాన్లకు చిన్నపాటి గాయాలైనట్టు చెప్పింది. ఈ ఘటన పూంఛ్ లో నియంత్రణ రేఖ దగ్గర జరిగింది.