సినీఫక్కీలో యువతి కిడ్నాప్.. అస్తిపంజరం ఉంచి ఇల్లు పేల్చేందుకు కుట్ర..!

సినీఫక్కీలో యువతి కిడ్నాప్.. అస్తిపంజరం ఉంచి ఇల్లు పేల్చేందుకు కుట్ర..!

సినీఫక్కీలో ఓ యువతి కిడ్నాప్‌ అయితే.. కేవలం గంటలోనే ఛేదించారు కడప జిల్లా పోలీసులు.. వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లాలో సినీఫక్కీ తరహాలో యువతిని కిడ్నాప్‌ చేశాడు యువకుడు.. అదే సమయంలో భారీ పేలుడుకు కుట్ర పన్నినట్టు పోలీసులు తేల్చారు. అమ్మాయిని కిడ్నాప్ చేసే సమయంలో ఇంట్లో పెట్రోల్ చల్లి, రెండు గ్యాస్ సిలిండర్లు లీక్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. సిలిండర్ పేలి యువతి మరణించినట్లుగా చిత్రీకరించాలనే ప్లాన్‌తో.. ఇంట్లో ముందుగానే అస్తిపంజరాన్ని తెచ్చిపెట్టాడు నిందితుడు కృష్ణ మోహన. కడపలో ని ఓ ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న కృష్ణమోహన్‌ను కిడ్నాపైన యువతితో పాటు... తమిళనాడు వేలూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకవేళ సిలిండర్ పేలి ఉంటే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగేదని పోలీసులు చెప్పారు. యూట్యూబ్ లో వీడియో చూసి కిడ్నాప్ కు ప్రణాళిక రూపొందించిన నిందితుడు... ఆ అమ్మాయిపై వన్‌ సైడ్‌ లవ్‌ కలిగి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.