40 సెకన్లకు ఒకరి ఆత్మహత్య !

40 సెకన్లకు ఒకరి ఆత్మహత్య !

ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. వినడానికి వింతగా ఉన్నా ఈ ఉగ్రవాదులు, లేక ప్రకృతి వైపరీత్యాల వలన చనిపోయే దానికంటే ఆత్మహత్య చేసుకుని చనిపోయేవారే ఎక్కువ అంటే నమ్మగలమా ? కానీ అదే నిజం. ఈ ప్రపంచంలో ప్రతి 40 సెకన్లకు ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) పేర్కొంది. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా ఆత్మహత్యలపై సర్వ్ చేపట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయాన్ని పేర్కొంది. ఆ చనిపోతున్న వారు కూడా ఎక్కివగా ఉరి, విషం, తుపాకితో కాల్చుకోవడం తదితర పద్దతుల ద్వారా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని డబ్ల్యుహెచ్‌ఒ పేర్కొంది.

ప్రజలు మానసిక ఒత్తిడికి తట్టుకోగలిగే విధంగా ఆత్మహత్యా నివారణ ప్రణాళికలను అమలు చేయాలని డబ్ల్యుహెచ్‌ఒ అన్ని దేశాల ప్రభుత్వాలను కోరింది. ఆత్మహత్య చేసుకోవడం ప్రపంచ సమస్యగా మారిందని డబ్ల్యుహెచ్‌ఒ పేర్కొంది. వయస్సు, లింగభేదం, ప్రాంతం అనే భేదం లేకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఈ సందర్భంగా పేర్కొంది. అదీ కాక బలవన్మరణాలకు పాల్పడుతున్నవారిలో ఎక్కువమంది యువతీయువకులే. అదీ 15-29 ఏళ్ల మధ్యవారే ఎక్కువగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రజల్లో చైతన్యం రగిల్చి ఆత్మహత్యల నివారణే లక్ష్యంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతోంది డబ్ల్యుహెచ్‌ఒ.