ప్రాణం తీసిన ఆర్మీ సెలెక్షన్‌

ప్రాణం తీసిన ఆర్మీ సెలెక్షన్‌

హైదరాబాద్  ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ లో అపశృతి జరిగింది.కరెంటు వైర్లు తగిలి  వనపర్తి జిల్లా ఆత్మకూరుకు చెందిన అరవింద్ మృతి చెందాడు. ఆర్మీ టెరిటోరియల్ క్యాంప్ లోని గ్రౌండ్ లో ఆర్మీ సెలక్షన్ కోసం వచ్చిన అరవింద్ కిందకి వేల్లాడుతున్న విద్యుత్ తీగలకు తగిలి మరణించాడు. అరవింద్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇవాళ్టి నుంచి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ చేపట్టడంతో ఎనిమిది రాష్ట్రాల నుండి అభ్యర్థులు వేల సంఖ్యలో విచ్చేసారు. అర్థరాత్రికే అభ్యర్థులు చేరుకున్నారు. పరుగు పందేనికి వేలాదిమంది అభ్యర్థులు రావడంతో  అధికారులు చేతులెత్తేసారు. సెలెక్షన్ కోసం వచ్చిన యువకులకు సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు . మరోవైపు కనీసం తాగడానికి నీళ్ళు కూడ ఏర్పాటు చేయలేదని రిక్రూట్ మెంట్ ర్యాలీకి విచ్చేసిన అభ్యర్ధులు ఆగ్రహం వ్యక్తం చేసారు . వసతి సౌకర్యం లేక బస్టాపుల్లోనే ఉంటున్నామని, వర్షానికి తడిసిన ఎవరూ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.