సూపర్ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు!! ఎప్పుడు? ఎక్కడ?

సూపర్ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు!! ఎప్పుడు? ఎక్కడ?

ఏప్రిల్ 11 నుంచి అమెజాన్ ఇండియా అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ పెస్ట్ సేల్ నిర్వహించబోతోంది. ఈ సేల్ లో మీకు వన్ ప్లస్ 6టీ, హానర్ ప్లే, హానర్ 8X, హానర్ 8C, హానర్ 7C మొబైల్ ఫోన్లపై బెస్ట్ ఆఫర్లు, సూపర్ డిస్కౌంట్లు లభించబోతున్నాయి. ఈ సేల్ పూర్తిగా మొబైల్ ఫోన్లపైనే జరగనుంది. ఏప్రిల్ 11న ప్రారంభమైన ఏప్రిల్ 13 వరకు జరగనుంది. ఈ సేల్ లో మీకు రియల్ మి యు1, ఒప్పో ఎఫ్9 ప్రో, వివో వీ15, ఒప్పో ఎఫ్11 ప్రో మొబైల్ ఫోన్లపై కూడా బెస్ట్ ఆఫర్లు, డిస్కౌంట్లు లభిస్తాయి.

ఐఫోన్ ఎక్స్ఆర్ స్మార్ట్ ఫోన్ కూడా ఈ సేల్ లో అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. మూడు రోజుల పాటు సాగే అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ లో మీరు హువావీ మేట్ 20 ప్రో మొబైల్ ఫోన్ ను కొనుక్కోవచ్చు. ఈ మొబైల్ ఫోన్ పై మీకు భారీ ఆఫర్లు లభించనున్నాయి. 

అమెజాన్ ఇండియాలో జరగబోయే ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ లో మీకు వన్ ప్లస్ 6టీ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.34,499కే లభించనుంది. దీని అసలు ధర రూ.37,999గా ఉంది. మీరు హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,500 డిస్కౌంట్ కూడా ఇవ్వనున్నారు.

ఈ సేల్ లో వన్ ప్లస్ 6టీ మొబైల్ ఫోన్ల 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ వేరియంట్ పై మీకు రూ.3,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. అంతే కాకుండా 8జీబీ/128జీబీ వేరియంట్ లేదా 8జీబీ/256జీబీ మోడల్ తీసుకోవాలనుకుంటే ఈ రెండు మోడల్స్ పై రూ.4,000 డిస్కౌంట్ లభించనుంది.

హానర్ ప్లే మొబైల్ ఫోన్ కొనాలనుకుంటే మీకు ఈ సేల్ లో ఈ స్మార్ట్ ఫోన్ రూ.13,999కే తీసుకోవచ్చు. దీని అసలు ధర రూ.19,999గా ఉంది. హానర్ 8ఎక్స్ మొబైల్ ఫోన్ రూ.2,000 తగ్గింపు ధరలకు రూ.12,999కే లభిస్తోంది.