కమ్మిన్స్.. వాట్ ఏ క్యాచ్

కమ్మిన్స్.. వాట్ ఏ క్యాచ్

టీ20 క్రికెట్ వచ్చినప్పటి నుండి ఆటగాళ్లు అందరూ అద్భుతాలు చేస్తున్నారు. ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో తమ అత్యుత్తమ ప్రదర్శనను చేస్తున్నారు. అయితే మైదానంలోని ఆటగాళ్లతో సహా బౌలర్లు కూడా అద్భుత క్యాచ్ లను అందుకుంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ పేస్ బౌలర్ పాట్ కమ్మిన్స్ ఓ అద్బుత క్యాచ్ ను పట్టాడు.

రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరిగింది. 516 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో లంక బ్యాట్స్ మెన్స్ తిరిమన్న, డిక్వెల్లాలు క్రీజులో ఉన్నారు. పాట్ కమ్మిన్స్ వేసిన 23వ ఓవర్ మూడో బంతిని లంక బ్యాట్స్ మెన్ తిరిమన్న ఎదుర్కున్నాడు. బంతి కాస్త బౌన్స్ అవ్వడంతో తిరిమన్న డిఫెన్స్ ఆడబోయాడు. బంతి గ్లోవ్స్ కి తాకి అక్కడే గాల్లోకి లేవడంతో.. కమ్మిన్స్ పరుగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఆసీస్ ఆటగాళ్లు సంబరాలు చేసుకోగా.. తిరిమన్న నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్ లో ఆసీస్ 366 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. కమ్మిన్స్.. 'క్యా' క్యాచ్ హై, కమ్మిన్స్.. వాట్ ఏ క్యాచ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.