'ఎఫ్‌2' నుండి మ‌రో డిలీటెడ్ సీన్

'ఎఫ్‌2' నుండి మ‌రో డిలీటెడ్ సీన్

'విక్టరీ' వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించిన సినిమా ఎఫ్‌2 ( ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్‌). స్టార్ హీరోయిన్స్ త‌మ‌న్నా, మెహ‌రీన్‌లు క‌థానాయికలుగా న‌టించారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌లో 'దిల్' రాజు నిర్మించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా విడుద‌లై థియేట‌ర్స్ లో ప్ర‌భంజ‌నం సృష్టించింది. నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి తరువాత వెంకటేష్ ఫుల్ లెంగ్త్ కామెడీ కథలో నటించి ప్రేక్షకులను అలరించాడు.

కామెడీనే ప్రధాన అస్రంగా తెర‌కెక్కిన ఎఫ్‌2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని డిలీటెడ్ సీన్స్‌ని చిత్ర యూనిట్ విడుద‌ల చేస్తున్నారు. సోమవారం కూడా ఓ డిలీటెడ్ సీన్ ని వదిలారు. ప్ర‌కాశ్ రాజ్ బ‌యోపిక్ లో.. వెంకీ, వ‌రుణ్‌లు ఆయన బాల్యంకి సంబంధించిన స‌న్నివేశాల‌ని వివ‌రిస్తూ ఉండే వీడియోని చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ప్రస్తుతం ఈ వీడియోకి నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. మరి ఆలస్యం ఎందుకు మీరూ చేసేయండి.