మళ్ళీ భయపెడుతున్న ఉల్లి.. మూడు నెలల్లో మూడుసార్లు.. 

మళ్ళీ భయపెడుతున్న ఉల్లి.. మూడు నెలల్లో మూడుసార్లు.. 

కూరలో ఉల్లి లేకుండా వంట చేయడం తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించదు.  ఉల్లి లేకపోతె.. అసలు టేస్ట్ ఉండదు.  అందుకే ఉల్లి ధర ఎంత ఎక్కువుగా ఉన్నా కొనుగోలు చేయడానికి ప్రజలు ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు.  అయితే, ఈ ఏడాది ఉల్లి ధరలు మరింత అధికంగా అవుతున్నాయి.  దేశంలో అకాల వర్షాల కారణంగా ఉల్లి పంట దిగుమతి తగ్గిపోయింది.  

ధరలు తగ్గిపోవడంతో ప్రజలు కష్టాలు పడుతున్నారు.  మార్కెట్లో కిలో ఉల్లి ధర మాములు రోజుల్లో రూ. 20 నుంచి రూ. 30 వరకు ఉంటుంది.  కానీ, గత మూడు నెలలుగా ఈ ధరలు పెరిగిపోతున్నాయి.  ఇప్పుడు మార్కెట్లో రూ. 60 రూపాయలకు పైగా పెరిగిపోయింది.  దీంతో కేంద్రం విదేశాల నుంచి ఎప్పుడూ లేనంతగా లక్ష టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకున్నది.  అయినప్పటికీ ఉల్లి ధరలు తగ్గిపోయే పరిస్థితి కనిపించడం లేదు.  హైదరాబాద్ లో నాణ్యమైన ఉల్లి కిలో రూ. 60 వరకు పలుకుంటే.. తాలుగడ్డలు రూ. 30 రూపాయల వరకు అమ్ముతున్నారు.  ఇక చిల్లర దుకాణాల్లో ఈ ఉల్లి ధరకు ఒక నిర్దిష్టమైన ధర అంటూ ఉండటం లేదు.  ఏరోజు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి.