OROP అంటే కాంగ్రెస్ కు ఓన్లీ రాహుల్, ఓన్లీ ప్రియాంక

OROP అంటే కాంగ్రెస్ కు ఓన్లీ రాహుల్, ఓన్లీ ప్రియాంక

రాజకీయాల్లో ప్రియాంక గాంధీ ప్రవేశంపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కాంగ్రెస్ పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. మోడీ ప్రభుత్వానికి OROP అంటే వన్ ర్యాంక్ వన్ పెన్షన్. కానీ కాంగ్రెస్ కి మాత్రం దీని అర్థం ‘ఓన్లీ రాహుల్, ఓన్లీ ప్రియాంక’ అని షా ఎద్దేవా చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని ఐదేళ్ల కాంగ్రెస్ సర్కార్ లో రాజా, రాణి, రాజకుమారుడు తప్ప మిగతా వారెవరికీ స్థానం లేదని ఆయన ఆరోపించారు.

హిమాచల్ లోని ఉనాలో పన్నా ప్రముఖ్ సమ్మేళనంలో మాట్లాడుతూ అమిత్ షా ‘హిమాచల్ ప్రజల ఆశీర్వాదంతో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటయ్యక మోడీ ఓఆర్ఓపీపై తన వాగ్దానాన్ని పూర్తి చేశారు. మోడీ సర్కార్ కి ఓఆర్ఓపీ అంటే వన్ ర్యాంక్, వన్ పెన్షన్. కానీ కాంగ్రెస్ కి దీని అర్థం ఓన్లీ రాహుల్ ఓన్లీ ప్రియాంక’ అని వివరించారు. ‘గతంలో అటల్జీ కూడా హిమాచల్ అంటే ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. ఇవాళ మోడీ కూడా హిమాచల్ పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు జైరామ్ ఠాకూర్ ప్రభుత్వం తమ సొంత ప్రభుత్వమేనని ప్రజలు భావిస్తున్నారని’ షా అన్నారు. 55 ఏళ్ల వరకు కాంగ్రెస్ పరిపాలించింది. ఐతే పేదరికాన్ని తరిమికొట్టే బాధ్యత మా ప్రభుత్వంపై పడింది. నాలుగు తరాలుగా కాంగ్రెస్ దేశానికేం చేసిందని’ ప్రశ్నించారు.