పాకిస్థాన్ కు రిటర్న్ గిఫ్ట్ అదిరింది

పాకిస్థాన్ కు రిటర్న్ గిఫ్ట్ అదిరింది

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఐసీసీ చాంపియన్‌ ట్రోఫీ ఫైనల్‌లో పాక్‌ చేతిలో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది ఇదే రోజు(జూన్‌ 18న). సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజు ఓవల్‌లో చాంపియన్‌ ట్రోఫీ ఫైనల్‌ భారత్‌ను పాక్‌ ఓడించిందని ఐసీసీ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. దీనిపై టీమిండియా అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఏ గడ్డపై ఓడిపోయామో అదే గడ్డపై మట్టికరిపించాం అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ‘రెండు సంవత్సరాలకు రెండు రోజుల ముందే పాక్‌పై బదులు తీర్చుకున్నాం’,  ‘చాంపియన్‌ ట్రోఫీ జరిగిన ఇంగ్లండ్‌లోనే ప్రపంచకప్‌లో పాక్‌ పనిపట్టాం’, ‘పాకిస్తాన్‌కు టీమిండియా ఇచ్చిన రిటర్న్‌ గిఫ్ట్‌ అదిరింది’, అంటూ మరికొందరు ట్వీట్‌ చేస్తున్నారు.