ఏపీ ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల

ఏపీ ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలను కొద్దిసేపటి క్రితం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలకు దాదాపు లక్షమంది విద్యార్థులు హాజరయ్యారు. 'ఓపెన్‌' టెన్త్‌లో 69.93% మంది ఉత్తీర్ణత సాధించారు. 56149 మంది పరీక్షలు రాయగా 39263 మంది ఉత్తీర్ణులయ్యారు. 'ఓపెన్‌' ఇంటర్‌లో  67.82% మంది ఉత్తీర్ణత సాధించారు. 60997  మంది పరీక్షలు రాయగా 41367 మంది ఉత్తీర్ణులయ్యారు.