హిట్‌మ్యాన్‌ @ 50

హిట్‌మ్యాన్‌ @ 50

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా ఓపెనర్, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ 50 (61 బంతుల్లో; 3x4, 1x6) అర్ధశతకం సాధించాడు. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా వేసిన 21.5వ బంతికి సింగిల్‌ తీసి కెరీర్‌లో 40వ అర్ధశతకం అందుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ ఆచితూచి ఆడుతుండగా.. ధావన్ ఆసీస్ పేసర్లను ధీటుగా ఎదుర్కొంటూ బౌండరీల మోత మోగిస్తున్నాడు. ఇద్దరు ఓపెనర్లు అర్ధశతకాలతో అదరగొట్టడంతో.. భారత్ భారీ స్కోర్ దిశగా వెళ్తోంది. ఈ జోడి ఇప్పటికే 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రస్తుతం 25 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ వికెట్ నష్టపోకుండా 148 పరుగులు చేసింది. ధావన్ (82), రోహిత్ (64) క్రీజులో ఉన్నారు.