మొదటి మ్యాచ్ ను 20 కోట్ల మంది చూసారంట..! 

మొదటి మ్యాచ్ ను 20 కోట్ల మంది చూసారంట..! 

అభిమానులు ఎప్పటినుండో ఎదురు చూస్తున ఐపీఎల్ 2020 పండుగ ఈ నెల 19 న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ లీగ్ మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ తలపడగా 5 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ను 20 కోట్ల మంది చూసారంట. కరోనా కారణంగా ఆలస్యం అయిన ఈ ఏడాది ఐపీఎల్ యూఏఈ వేదికగా జరుగుతుంది. అక్కడ కూడా ఈ వైరస్ వలనే అభిమానులను స్టేడియం లోపలికి అనుమతించడం లేదు. అందువల్ల అందరూ ఇంట్లోనే ఉండి మ్యాచ్ లు చూడాలి. ఈ కారణంగానే ఐపీఎల్ యొక్క ప్రారంభ మ్యాచ్ కొత్త రికార్డును నెలకొల్పింది!. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. అందులో... బ్రాడ్‌కాస్టింగ్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌(బీఏఆర్‌సీ) నివేదిక ప్రకారం 20 కోట్ల మంది ఐపీఎల్ మొదటి మ్యాచ్ చూసారు. అయితే ఏ దేశంలోనైనా నిర్వహించే స్పోర్ట్స్ లీగ్ మొదటి మ్యాచ్ ను ఇంత మంది వీక్షించలేదని తెలిపాడు. ఇక ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ కోల్‌కత నైట్ రైడర్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది.