ఓపెనింగ్‌లోనే 10,700 దిగువకు నిఫ్టి

ఓపెనింగ్‌లోనే 10,700 దిగువకు నిఫ్టి


అంతర్జాతీయ మార్కెట్ల దారిలో మన మార్కెట్లు కూడా నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టి 10700 ఎగువనే ఓపెనైనా.. కొన్ని నిమిషాల్లోనే ఆ స్థాయిని కోల్పోయింది. రాత్రి అమెరికా మార్కట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగియగా, ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. వడ్డీ రేట్లను ఫెడరల్‌ రిజర్వ్‌ పెంచకపోయినా... ద్రవ్యోల్బణం ఆందోళన కల్గించే స్థాయికి పెరుగుతోందని ఫెడరల్‌ రిజర్వ్‌ పేర్కొంది. దీంతో ఈసారి చాలా వడ్డీ రేట్ల పెంపు ఖాయమని, పైగా పెంపుదల అధికంగా ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ఈ నేపథ్యంలో  దాదాపు రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.భారీ అమ్మకాల ఒత్తిడి తరవాత  మెటల్‌ షేర్లలో కాస్త కొనుగోలు ఆసక్తి కన్పిస్తోంది. రియాల్టి షేర్ల సూచీ ఒక శాతంపైగా నష్టపోయింది. అలాగే ఫార్మా కూడా. నిఫ్టి షేర్లలో ఇన్ ఫ్రా టెల్‌ 2.5 శాతం లాభపడగా, వేదాంత, హిందాల్కో లాభాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌ అయిదు శాతం నష్టపోయింది. అలాగే విప్రో కూడా నష్టంతో ట్రేడవుతోంది.