రోహిత్ అవుట్

రోహిత్ అవుట్

ఐదు వన్డే సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీంఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (0) పరుగుల ఖాతా తెరవవకుండానే పెవిలియన్ చేరాడు. కమిన్స్‌ బౌలింగ్‌లో.. మొదటి ఓవర్ చివరి బంతికి షాట్‌ ఆడిన రోహిత్‌ జంపాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో తొలి ఓవర్‌లో భారత్‌ పరుగులు చేయకుండానే వికెట్‌ సమర్పించుకుంది. ప్రస్తుతం క్రీజ్ లో శిఖర్ ధావన్ (6), విరాట్ కోహ్లీ (0)లు ఉన్నారు. భారత్ 2 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది.