ఒప్పో ఫైండ్ ఎక్స్.. అదిరే ఫీచర్స్‌..

ఒప్పో ఫైండ్ ఎక్స్.. అదిరే ఫీచర్స్‌..

కెమెరా ఫోన్ మార్కెట్ ను కబ్జా చేసిన చైనా కంపెనీ ఒప్పో తన కొత్త స్మార్ట్ ఫోన్.. ఒప్పో ఫైండ్ ఎక్స్ ను ఈ నెల 12న ఢిల్లీలో విడుదల చేయనుంది. గత నెలలోనే పారిస్ లో విడుదలైన ఈ ఫోన్ తన ఆల్ స్క్రీన్ డిస్ ప్లేతో అందరినీ ఆకర్షించింది. 

ఫీచర్ల విషయానికి వస్తే ఒప్పో ఫైండ్ ఎక్స్‌లో 93.8% స్క్రీన్ టు బాడీ రేషియో ఉన్నట్టు కంపెనీ చెబుతోంది. 6.3 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అలాగే ఇందులో క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 845 పవర్‌ఫుల్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వంటి ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి. వెనుక భాగంలో 16+20 మెగాపిక్సెల్ కెమెరాలు, ముందు భాగంలో 25 మెగాపిక్సెల్ కెమెరా, 3730 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కలర్‌ ఓఎస్‌ 5.1పై, ఆండ్రాయిడ్‌ 8.1 ఆధారంగా పనిచేస్తుంది. 

పాప్ డ్యుయల్ కెమెరా ఫీచర్ తో వస్తున్న ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ విడుదల కోసం మార్కెట్ ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఈ స్టెల్త్ 3డి కెమెరాలు వాటిని యాక్టివేట్ లేదా డివైస్ అన్ లాక్ చేసే వరకు కంటికి కనిపించవు. వివో నెక్స్ ఎస్, హువావీ పీ20 ప్రో, ఐఫోన్ ఎక్స్, శాంసంగ్ గెలాక్సీ ఎస్9ప్లస్ వంటి అధునాతన కెమెరా ఫోన్లకి పోటీగా దిగుతున్న ఫైండ్ ఎక్స్ పై ఎక్స్ పెక్టేషన్స్ హై ఎండ్ లో ఉన్నాయి. దీని ధర సుమారుగా రూ.80,000 పైనే ఉండొచ్చని భావిస్తున్నారు.