పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో ఒప్పో కె3

పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో ఒప్పో కె3

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో తన కొత్త స్మార్ట్ ఫోన్ ఒప్పో కె3ని లాంచ్ చేసింది. చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ లో పాప్-అప్ సెల్ఫీ కెమెరా, ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఒప్పో కె3లో ఆక్టా-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్ తో పాటు ఒక ప్యానరమిక్ శాంసంగ్ ఎమోలెడ్ డిస్ ప్లే కూడా ఇచ్చారు. కె3ని ఐ ప్రొటెక్షన్ ఫోన్ గా సర్టిఫై చేయడం జరిగిందని కంపెనీ చెబుతోంది. ఫోన్ స్పెసిఫికేషన్, ధరల వివరాల్లోకి వెళితే..

చైనాలో ఒప్పో కె3 6జీబీ ర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధరను 1,599 యువాన్లు(దాదాపు రూ.16,100)గా నిర్ణయించారు. 6జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ వెల 1,899 యువాన్లు(సుమారు రూ.19,100)గా, 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజీ స్మార్ట్ ఫోన్ ధర 2,299 యువాన్లు(రమారమి రూ.23,200)గా నిర్ణయించడం జరిగింది. చైనాలో ఒప్పో కె3 ఫోన్ల అమ్మకం జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. 

ఒప్పో కె3లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డి+ ఎమోలెడ్ డిస్ ప్లే ఇచ్చారు. దీని రెజొల్యూషన్ 1080X2340 పిక్సెల్, యాస్పెక్ట్ రేషియో 19.5:9గా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 9 పై ఆధారిత కలర్ఓఎస్ 6.0పై పనిచేసే ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్ ఉపయోగించారు. ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్లు-6జీబీ ర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 6జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజీలలో వస్తోంది. యూజర్లు అద్భుతమైన గేమింగ్ ఎక్స్ పీరియన్స్ పొందేందుకు ఫోన్ లో గేమ్ బూస్ట్ 2.0 లోడ్ చేసి ఉంటుంది.

కెమెరా గురించి చెప్పాలంటే ఒప్పో కె3లో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 2 మెగాపిక్సెల్ సెకండరీ డెప్త్ సెన్సర్ ఉన్నాయి. ఫోన్ ముందువైపు 16 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఒప్పో ఈ కొత్త ఫోన్ లో ఏఐ పోర్ట్రయిట్ మోడ్, ఏఐ సీన్ డిటెక్షన్ వంటి ఎన్నో అద్భుతమైన కెమెరా ఫీచర్లు అమర్చారు. ఇవి కాకుండా తక్కువ వెలుతురులో కూడా చక్కటి ఫోటోలు తీసేందుకు ఫోన్ లో అల్ట్రా క్లియర్ నైట్ వ్యూ 2.0 ఫీచర్ ఇచ్చారు.

ఒప్పో కె3లో 3,765 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంచారు. ఇది ఒప్పో VOOC 3.0 టెక్నాలజీ ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం ఫోన్ లో 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యుఎస్ బి వంటి ఆప్షన్లు ఇచ్చారు. ఫోన్ లో ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందించారు.