ఒప్పో ఎఫ్-9, ఎఫ్-9 ప్రొ విడుదల

ఒప్పో ఎఫ్-9, ఎఫ్-9 ప్రొ విడుదల

చైనా స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం ఒప్పో మరో రెండు మోడల్స్ ను భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఎఫ్-9, ఎఫ్-9 ప్రొ సీరిస్ గా వీటిని విడుదల చేసింది. వీటి ప్రారంభ రేటు  రూ.19,000, రూ.23,990లుగా నిర్ణయించారు. ఈ ఫోన్ వినియోగదారులకు త్వరలో మార్కెట్లో లభ్యం కానుంది. ఇందులో 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ సౌకర్యాలు ఉన్నాయి.