భారత మార్కెట్లోకి 'రియల్‌ మి 2'

భారత మార్కెట్లోకి 'రియల్‌ మి 2'

చైనా మొబైల్‌ సంస్థ ఒప్పో 'రియల్‌ మి 2' ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో 'రియల్‌ మి 2' ను లాంచ్ చేశారు. గతంలో విడుదల చేసిన 'రియల్‌ మి 1' కు ఆదరణ లభించడంతో రియల్‌ మి 2 ను లాంచ్ చేసింది. బేసిక్‌ మోడల్‌ 3జీబీ+32 జీబీ స్టోరేజి వేరియంట్‌ ధర రూ. 8,990 లకు వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇక 4జీబీ+64జీబీ స్టోరేజి వేరియంట్‌ ధర రూ. 10,990గా ఉంది. ఈ 'రియల్‌ మి 2' సెప్టెంబర్ 4 మధ్యాహ్నం 12.00 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి డైమండ్ బ్లాక్, డైమండ్ రెడ్ రెండు రంగులలో లభ్యమవనుంది. ఇక బ్లూ కలర్ అక్టోబర్ లో అందుబాటులోకి వస్తుంది.

ఫీచర్లు:

# 6.20 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే
# 720x1520  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
# 8.1 ఒరియో 
# 19:9 యాస్పెక్ట్ రేషియో
# 1.8 గిగా హెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
# 3జీబీ ర్యామ్‌.. 32 జీబీ స్టోరేజ్‌(256 జీబీ వరకు ఎక్సపండబుల్)
# 13+2ఎంపీ డ్యుయల్‌రియర్‌ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
# 4230ఎంఎహెచ్‌ బ్యాటరీ