మెరుపు తీగల్లా ఉంటేనే అవకాశాలా..?

మెరుపు తీగల్లా ఉంటేనే అవకాశాలా..?

సినీప్రపంచంలో నిలబడాలంటే.. గ్లామర్ ఉండాలి.  గ్లామర్ ను ఎంత కాలం కాపుకుంటే అన్ని అవకాశాలు వస్తాయి.  అందుకే హీరోయిన్లు వారి గ్లామర్ ను కాపాడుకోవడానికి విపరీతంగా కష్టపడుతుంటారు.  కొంతమంది తారలు నాలుగైదు నెలల సమయం దొరికితే చాలు.. అమాంతం లావు పెరిగిపోతుంటారు.  అవకాశాలు వస్తున్నాయి అనుకోగానే మరలా జిమ్ కి  మాములుగా తయారవుతుంటారు.  ఇక కరీనా కపూర్ జీరో ప్యాక్ తరువాత తారలు ఆదిశగా అడుగులు వేశారు.  సౌత్ నార్త్ అనే తేడా లేకుండా హీరోయిన్లంతా వీలైనంతగా సన్నబడేందుకు ఉత్సాహం చూపించారు.  

పెళ్ళైన తరువాత కూడా కరీనా కపూర్ జీరో ప్యాక్ ను మెయింటైన్ చేస్తోంది.  ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. ఇప్పుడు వస్తున్నా యువ నాయకీమణులు  కాస్తంత స్లిమ్ గా కనిపిస్తూ..  స్టార్ హీరోయిన్లతో పోటీ  పడుతున్నారు.   అనుష్క శెట్టి ఇండస్ట్రీకి  వచ్చిన కొత్తల్లో స్లిమ్ గా ఉండేది. బాహుబలి సమయానికి కాస్తంత బొద్దుగా మారింది.  బాహుబలి చారిత్రాత్మకమైన సినిమా కాబట్టి, ఆ సినిమాకు సరిపోయింది.  ఆ తరువాత వచ్చిన భాగమతిలో అనుష్క కొంచెం స్లిమ్ గా కనిపించింది.  ఇప్పుడు అనుష్క గోపిచంద్ తో ఓ కమర్షియల్ సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది.  ఈ సినిమా కోసం ఈ అమ్మడు మునుపటిలా స్లిమ్ గా కనిసించేందుకు ప్రయత్నాలు చేస్తోంది అనుష్క.  

 కాజల్  మొదట్లో కాజల్ విషయం తీసుకుంటే, ఇండస్ర్టీకి వచ్చిన మొదట్లో కాజల్ సాధారణ వెయిట్ తో బాగుండేది.  వరసగా పెద్దపెద్ద స్టార్ తో సినిమాలు చేసే అవకాశం పొందింది కాజల్.  టాలివుడ్లో అవకాశాలు తగ్గుతున్నాయి అనుకున్న సమయంలో, బాలివుడ్లోకి అడుగుపెట్టింది.  కాని, అక్కడ అనుకున్న విధంగా రాణించలేకపోవడంతో, కాజల్ తిరిగి టాలివుడ్ కు చేరుకుంది.  ఇలా రిటన్ వచ్చిన కాజల్, పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేసింది.  ఈ సినిమాలో కాజల్ మరీ సన్నగా మారింది.  కొన్ని రోజుల వరకు గుర్తు పట్టలేకపోయారంటే అర్ధం చేసుకోవచ్చు. 

ఇప్పుడు హన్సిక కూడా ఇంచుమించు ఇలాగే మారింది.  హన్సికకు తెలుగులో అవకాశాలు లేకపోవడంతో.. టాలివుడ్ నుంచి కోలివుడ్ వెళ్లింది.  అక్కడ వరస హిట్స్ వచ్చాయి.  పైగా ఈ అమ్మడు కోలివుడ్ వెళ్లాక కొద్దిగా లావు అయింది.  కోలివుడ్లో లావుగా ఉన్నా పెద్దగా పట్టించుకోరు.  హిట్స్ వస్తున్నాయి కాబట్టి చెల్లుబాటవుతుంది.  అలా బొద్దుగా ఉన్న హన్సిక, ఉన్నట్టుండి సడెన్ గా స్లిమ్ గామారిపోయింది.  ఎంతగా మారింది అంటే, ఎవరీమె అనేంతగా మారిపోయింది.  బొద్దుగా  బయటకు రాలేకపోయిందట.  అందుకే స్లిమ్ గా మారిపోయినట్టు చెప్తోంది హన్సిక.  స్లిమ్ గా ఉంటె ఎక్కువ అవకాశాలు వస్తాయేమో అన్నట్టుంది హన్సిక.  లావు తగ్గి స్లిమ్ గా మారిన హన్సికకు అవకాశాలు వస్తాయా.. చూద్దాం.