ట్రంప్‌ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో రచ్చరచ్చ..

ట్రంప్‌ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో రచ్చరచ్చ..

కశ్మీర్ సమస్యపై భారత్-పాకిస్థాన్ మధ్య మ‌ధ్యవ‌ర్తిత్వానికి రెడీ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు పార్లమెంట్‌లో దుమారం రేపాయి. ట్రంప్‌ను మోడీ మధ్యవర్తిగా ఉండాలని కోరారా? లేదా? అంటూ పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ ప్రకటన చేసినా.. కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గలేదు. ప్రధాని మోడీయే సభలో ప్రకటన చేయాలంటూ డిమాండ్ చేశాయి. దీంతో రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ట్రంప్ చెప్పినట్టుగా మోడీ కశ్మీర్ విషయంలో ఎప్పుడూ మధ్యవర్తిత్వంకోసం ప్రయత్నించలేదని విదేశాంగశాఖమంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. అయితే, ఇమ్రాన్ ఖాన్ స‌మ‌క్షంలో ట్రంప్ క‌శ్మీర్‌పై మాట్లాడ‌డం అనుమానాల‌కు తావిస్తోంద‌న్నారు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ.. క‌శ్మీర్ స‌మ‌స్య‌పై ట్రంప్ మ‌ధ్య‌వ‌ర్తిత్వాన్ని కోర‌డం అంటే.. ఇది ఇండియా ఐక్యశ‌క్తికి పెద్ద విఘాత‌మే అన్నారు. మోడీనే ఆహ్వానం కోరిన‌ట్లు ట్రంప్ తెల‌పారని గుర్తుచేసిన తివారీ.. ప్ర‌ధాని మోదీ స‌భ‌కు వ‌చ్చి.. ఈ అంశంపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై లోక్‌సభ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.