ప్రతిపక్ష నేతల కీలక భేటీ..

ప్రతిపక్ష నేతల కీలక భేటీ..

ప్రతిపక్ష నేతల ఇవాళ సమావేశం కానున్నారు. ఢిల్లీలోని కాన్స్ట్యూషన్ క్లబ్‌లో ఉదయం 11:45 గంటలకు సమావేశం కానున్నారు విపక్ష నేతలు... ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, అభిషేక్ మను సింగ్వి, కపిల్ సిబల్ సహా ఇతర నేతలు హాజరుకానున్నారు. దేశంలో ఎన్నికలు జరుగుతున్న తీరు, ప్రస్తుత పరిస్థితులు, ఈవీఎంలపై వస్తున్న అనుమానాలు, వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు, ప్రశ్నార్ధకంగా మారిన ఈసీ పనితీరు అంశాలపై కీలకంగా చర్చించనున్నారు. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు, ఎన్నికల నిర్వహణలో పారదర్శకత అంశాలపై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించనున్నారు ప్రతిపక్ష నేతలు. ఇక ఏపీ ఎన్నికల్లో మొరాయింపు, ఈసీ పనితీరుపై శనివారం కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో సమావేశమైన సీఎ చంద్రబాబు టీమ్.. ఎన్నికల తీరుపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.