శరద్‌ పవార్‌ నివాసంలో కీలక భేటీ..

శరద్‌ పవార్‌ నివాసంలో కీలక భేటీ..

ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ దగ్గర ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న తర్వాత వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలంతా ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, శత్రుఘ్న సిన్హా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా తదితరులు హాజరయ్యారు. ఇప్పటికే పలు దపాలుగా బీజేపీయేతర పార్టీలకు చెందిన నేతలు సమావేశాలు నిర్వహించగా... ఇవాళ జరిగిన ఈ సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించినట్టుగా తెలుస్తోంది.