సాయంత్రం విపక్షాల భేటీ?

సాయంత్రం విపక్షాల భేటీ?

హంగ్‌ ఏర్పడే పక్షంలో ఇవాళ సాయంత్రం  ఢిల్లీలో విపక్షాల భేటీకి రంగం సిద్ధమైంది. యూపీఏతో పాటు  బీజేపీ వ్యతిరేక పార్టీలను ఈ భేటీకి ఆహ్వానించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.  ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకుంటే యూపీఏలోని ఆరు పక్షాలతోపాటు టీడీపీ, బహుజన సమాజ్‌ వాదీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీతో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక కూటమిగా ఏర్పడాలని ప్రతిపాదించాయి. 

టీఆర్‌ఎస్‌, వైకాపా నేతలకు కూడా ఈ భేటీకి ఆహ్వానించాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. హంగ్‌ వచ్చే పక్షంలో అతి పెద్దగా కూటమిగా ఏర్పడి... ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని రాష్ట్రపతికి లేఖ ఇవ్వాలని విపక్ష నేతలు భావిస్తున్నారు. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై ఓ అంచనా ఏర్పడుతుందని, హంగ్‌కు ఛాన్స్‌ ఉండే పక్షంలో ఇవాళ  రాత్రికి ఢిల్లీలో విపక్షాల భేటీ ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు.