అన్ని పూర్తిగా లెక్కించాల్సిందే..

అన్ని పూర్తిగా లెక్కించాల్సిందే..

ఎన్డీయేతర పక్ష నేతలు మంగళవారం ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఒక్క పోలింగ్‌ బూత్‌లోని వీవీప్యాట్‌ స్లిప్పుల్లో తేడాలు వచ్చినా.. మొత్తం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని వీవీప్యాట్‌
స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చాలని ఈసీకి సమర్పించిన వినతి పత్రంలో కోరారు. సంక్లిష్ట సందర్భాల్లో రిటర్నింగ్‌ అధికారి ఎలా వ్యవహరించాలో ఈసీ గైడ్‌లైన్స్‌ ఇవ్వాలని కోరారు. ముందుగా వీవీప్యాట్లు లెక్కించిన తర్వాతే ఫలితం ప్రకటించాలని అన్నారు. ఫామ్‌ 17సీని కౌంటింగ్‌ ఏజెంట్లు, లెక్కింపు కేంద్రంలోకి తీసుకువెళ్లేందుకు అనుమతించాలని, రిటర్నింగ్‌ అధికారి ఏకపక్షంగా చర్యలు తీసుకోరాదని కోరారు. కౌంటింగ్‌ ప్రక్రియలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలను నిలువరించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని, తగిన భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు. 50శాతం వీవీప్యాట్లు లెక్కించాల్సిందేనని, దానికనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందేనని నేతలు కోరినట్లు సమాచారం. అంతకుముందు ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఎన్డీయేతర పక్షాల నేతలు సమావేశం జరిగింది. మొత్తం 19 పార్టీలకు చెందిన నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు.