బీసీ నేత కృష్ణయ్య అడుగులు ఎటువైపు?

బీసీ నేత కృష్ణయ్య అడుగులు ఎటువైపు?

ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీసీ ఉద్యమ నాయకుడు ఆర్.కృష్ణయ్య రాజకీయ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో తన రాజకీయ నిర్ణయం కూడా త్వరగా తీసుకోవాలని కృష్ణయ్య భావిస్తున్నట్లు సమాచారం. కార్యకర్తలు, అనుచరులతో ఈ మేరకు విరివిగా మంతనాలు జరుపుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా టెక్నికల్ గా మిగిలి ఉన్న తనను పలువురు టీఆర్ఎస్ నేతలు తమ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారని, తాను మాత్రం టీఆర్ఎస్ లోకి వెళ్లే పరిస్థితే లేదని చెబుతున్నట్టు తెలుస్తోంది. అటు రాహుల్ గాంధీ నుంచి పిలుపు వచ్చిందని.. అయితే బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీవైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఒకవేళ కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందన్న అంశాన్ని కూడా ఆయన పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.