వాణిజ్య వివాదాల పరిష్కారానికి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు

వాణిజ్య వివాదాల పరిష్కారానికి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు

ప్రపంచ వాణిజ్య సూచీలో భారతదేశ స్థానాన్ని మెరుగుపరిచేందుకు కేంద్రప్రభుతవ్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా వాణిజ్యపరమైన వివాదాలు త్వరగా పరిష్కరించేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్‌ల ఏర్పాటుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కు కేంద్రమంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం హైకోర్టుల చట్టం కింద వాణిజ్య న్యాయస్థానాలు, కమర్షియల్ డివిజన్ అలాగే కమర్షియల్ అప్పిలేట్ డివిజన్‌ను ఏర్పాటు చేస్తారు. పార్లమెంటులో పెండింగ్లో ఉన్న బిల్లు ప్రకారం, వాణిజ్య వివాదంలో పేర్కొన్న విలువ ప్రస్తుతం రూ .1 కోట్ల నుంచి రూ .3 లక్షలకు పడిపోతుంది. ప్రతిపాదిత ఆర్డినెన్స్‌ పెండింగ్ బిల్లు స్థానాన్ని భర్తీ చేస్తుంది. తక్కువ విలువ కలిగిన వాణిజ్య వివాదాల పరిష్కారంలో ప్రస్తుతం 1,445 రోజులు తీసుకున్న సమయాన్ని ఇది తగ్గిస్తుంది. వీటితో పాటుగా చక్కెర పరిశ్రమలకు ఆర్థిక సహాయాన్ని అందించాలని... లక్నో, చెన్నై, గౌహతి విమానాశ్రయాల్లో వసతుల కల్పన, విమానాశ్రయాల ఆధునికీకరణ, మౌలిక వసతులు, విస్తరణ పనులతో పాటు.. ఢిల్లీలోని నజఫ్‌నగర్‌లో వంద పడకల ఆస్పత్రి నిర్మాణం, గ్రీన్ రివెల్యూషన్-కృషోన్నతి యోజనను కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.