మరో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య...

మరో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య...

తెలంగాణలో ఇంటర్ ఫలితాల్లో చోటుచేసుకున్న తప్పిదాలతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. రీ-వాల్యుయేషన్, రీ-వెరిఫికేషన్‌కు ప్రభుత్వం పూనుకున్నా... ఆత్మహత్యలు ఆగడం లేదు. ఇవాళ నారాయ‌ణ పేట జిల్లా ధ‌న్వాడ మండ‌లం కొండ్రోనుప‌ల్లిలో ఇంట‌ర్ విద్యార్దిని ఆత్మహత్య చేసుకుంది. బైపీసీ ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో ఒక స‌బ్జెక్ట్‌లో ఫెయిల్ అయిన శిరీష.. మనస్తాపానికి గురైంది. దీంతో ఇవాళ కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... విచారణ చేపట్టారు.