థియేటర్లకు ఓటీటీ పోటీ కాదు

థియేటర్లకు ఓటీటీ పోటీ కాదు

ప్రస్తుతం రూపొందుతున్న చాలా సినిమాలు ఓటీటీలపై మొగ్గు చూపుతున్నాయి. కానీ ఓటీటీలు సినిమా థియేటర్లకు ప్రత్యామ్నాయం కావని, అవ్వలేవని టాలీవుడ్ నిర్మాతలు బలంగా అంటున్నారు. లాక్‌డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతబడటం కారణంగానే ఓటీటీలు ప్రాథాన్యం పొందాయని, ఎప్పటికీ అవి థియేటర్ల స్థానాన్ని పొందలేవని అంటున్నారు. దానికి తోడు థియేటర్లు తెరుచుకుంటే మళ్లీ పాత రోజులు కనిపిస్తాయని అందరూ ఆశ పడుతున్నారు. కానీ ప్రస్తుత పరిస్తితులను బట్టి ఓటీటీలు సినిమా థియేటర్ల స్థానాన్ని కబ్జా చేస్తున్నట్లే ఉంది. మరి తిరిగి థియేటర్లు తెరుచుకుంటే మళ్లీ వాటి స్థానాన్ని అవి పొందుతాయా..లేదా..అనేది ఓ పెద్ద ప్రశ్నగా ఉంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతబడటంతో ఓటీటీలు పుంచుకున్నాయి. కలర్ ఫొటో లాంటి చిన్న సినిమాలు, వీ లాంటి మీడియం బడ్జెట్ సినిమాలు ఓటీటీలో విడుదలయ్యియి. దీంతో థియేటర్ల బిజినెస్ దెబ్బతిన్నదనే అందరూ అంటున్నారు. ఓటీటీలు థియేటర్లను మింగేస్తున్నాయని, థియేటర్లకు ఇక స్వస్థి చెప్పాలని అన్నా మాటలు వచ్చినప్పుడల్లా, థియేటర్లు తెరుచుకుంటే పాత రోజులు తిరిగొస్తాయని ఎంతో నమ్మకంగా చెబుతున్నారు ఎగ్జిబిటర్లు. కానీ పరిస్థితులను చూస్తే ఈ ఏడాది మొత్తం థియేటర్ల కష్టాలు గట్టేక్కేలా కనబడటం లేదు.

ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా నిర్మాతలు థియేటర్లపై మొగ్గు చూపట్లేదు. నాగార్జు వైల్డ్ డాగ్ కూడా ఓటీటీకే పరిమితం కానుంది. అయితే టాలీవుడ్ టాప్ హీరోలు ఎవ్వరూ ఓటీటీ బాట పట్టలేదు. రామ్ కూడా థియేటర్ల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ నాగార్జునా ఓటీటీ బాట పట్టాడంటే థియేటర్లను కరోనా భయం ఇంకా వదిలినట్లు లేదు. మరి ఈ భయం ఎంత వరుకు కొనసాగనుందో చూడాలి. అంతేకాకుండా థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేయాలంటే నిర్మాతలు భయపడుతున్నారు. కేవలం 50 శాతం ప్రేక్షకులతో సినిమా రిలీజ్ కుదరదని కరాఖండిగా చెబుతున్నారు. కరోనా కారణంగానే థియేటర్లకు మార్కెట్ తగ్గి ఓటీటీలకు బిజినెస్ పెరిగింది. మరి థియేటర్ల పరిస్థితి ఎలా మారనుందో వేచి చూడాలి.