దారిచ్చి ... ప్రాణం కాపాడారు..!!

దారిచ్చి ... ప్రాణం కాపాడారు..!!

ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడటానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారు.  పోలీసులకు సహకరించారు.  డ్రైవర్ కు దారిచ్చారు.  8 గంటల దూరాన్ని నాలుగు గంటల్లో చేరుకునే విధంగా సహకరించారు.  ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు.  ఈ సంఘటన తమిళనాడులోని రామనాథపురంలో జరిగింది.  వివరాల్లోకి వెళ్తే... 

తమిళనాడు రామనాథపురంలో ఉండే నయనార్ మహ్మద్, జేసీమా దంపతులకు అమీర్ అనే కొడుకు ఉన్నాడు.  అతను గత కొన్ని రోజులుగా వెన్నుపూస సమస్యతో బాధపడుతున్నాడు.  ఈ సమస్య తీవ్రం కావడంతో... పుదుచ్చేరిలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లమని వైద్యులు సూచించారు.  అంబులెన్స్ ఏర్పాటు చేశారు.  రామనాథపురం నుంచి పుదుచ్చేరికి 400 కిలోమీటర్లు.  8 గంటల సమయం పడుతుంది. ప్రాణాపాయ స్థితిలో 8 గంటల ప్రయాణం అంటే ప్రాణాలతో చెలగాటమే. అయితే, అమీర్ విషయాన్ని తెలుసుకున్న ముస్లిం మున్నేట్ర కజగం పార్టీ నేతలు వెంటనే స్పందించి ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు.  ప్రజలు కేసుల పోలీసులకు సహకరించడంతో.. 400 కిలోమీటర్ల దూరానన్ని అంబులెన్స్ లో కేవలం 5 గంటల్లో తీసుకెళ్లి అమీర్ ప్రాణాలు కాపాడారు.  ఎలాంటి ప్రమాదం జరగకుండా డ్రైవింగ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్ కు అమీర్ తల్లిదండ్రులు కృతజ్ఞలు తెలిపారు.