ఆ సినిమాల ఓటీటీ రిలీజ్ కు విదేశీ మార్కెట్ కలసి వస్తుందా!?

ఆ సినిమాల ఓటీటీ రిలీజ్ కు విదేశీ మార్కెట్ కలసి వస్తుందా!?

భారత్ లోని సినిమా థియేటర్లను నూరు శాతం ఆక్యుపెన్సీతో నడుపుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి నెల రోజులు అవుతోంది. అయితే... అమెరికా లాంటి దేశాల్లో చాలా వరకూ థియేటర్లే తెరుచుకోని పరిస్థితి నెలకొంది. దాంతో ఎన్నారైలంతా ఓటీటీల వైపే ఆశగా చూస్తున్నారట.

కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో డిసెంబర్ నుండి థియేటర్లు తెరుచుకోగా, ఫిబ్రవరి నుండి నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతి లభించింది. దాంతో మాస్ మసాలా కమర్షియల్ సినిమాలతో పాటు సందేశాత్మక చిత్రాలు సైతం థియేటర్ల ముందు క్యూ కట్టాయి. అలా సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాలు కొన్ని టాక్ తో నిమిత్తం లేకుండా కలెక్షన్లను సాధించాయి. కానీ చిత్రమేమంటే.. ఇప్పటికీ అమెరికాలో పూర్తి స్థాయిలో థియేటర్లు తెరచుకోలేదు. కొద్ది పాటి థియేటర్లు తెరచుకున్నా... అక్కడి జనం పోలో మంటూ సినిమా చూడటానికి సినిమా హాళ్లుకు రావడం లేదంట. దాంతో వాళ్ళంతా ఓటీటీలో మూవీస్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారట. 'క్రాక్, మాస్టర్, రెడ్' వంటి పొంగల్ మూవీస్ అన్ని ఇప్పటికీ ఓటీటీలలో ప్రసారమైపోయి... పండగ చేసుకుంటున్నాయి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే... అమెరికాలో థియేటర్లు మామూలు స్థితికి చేరుకోవడానికి రెండు మూడు నెలలు పట్టేట్టుగా ఉంది. దాంతో నిర్మాతలు సైతం వీలైనంత త్వరగా తమ చిత్రాలను ఓటీటీలో విడుదలచేసి, ఎన్ ఆర్ ఐ ఆడియెన్స్ ను మెప్పించే ప్రయత్నంలో పడ్డారు. ఈ నెలలో వరుసగా వచ్చిన 'జాంబిరెడ్డి, ఉప్పెన, నాంది' చిత్రాలూ ఓటీటీలో త్వరలో స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి. 'ఉప్పెన' సినిమాను నెట్ ఫ్లిక్స్ సంస్థ, 'నాంది' చిత్రాన్ని ఆహా స్ట్రీమింగ్ చేయబోతున్నాయి. అలానే 'జాంబిరెడ్డి'కి సంబంధించి ఓటీటీ సంస్థలతో చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది. ఏదేమైనా... థియేటర్లు ఇక్కడ తెరుచుకున్నా, ఓటీటీలకు విదేశీ మార్కెట్ బాగా కలిసొచ్చే అంశమనే చెప్పాలి.