తమ పార్టీ హిందూమతానికి వ్యతిరేకం కాదు

తమ పార్టీ హిందూమతానికి వ్యతిరేకం కాదు

తమ పార్టీ హిందూమతానికి వ్యతిరేకం కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం హిందూత్వ వాదనను తెరపైకి తెచ్చేవారితోనే తమ పోరాటమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కు మద్దతుగా నల్లగొండలో నిర్వహించిన మైనార్టీల సభలో ఆయన ప్రసంగించారు. బడుగు, బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీలకు టీఆర్ఎస్ తోనే రక్షణ లభిస్తుందని.. సీఎం కేసీఆర్ పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ హిందూమతాన్ని ఎంతగా గౌరవిస్తారో.. ఇతర మతాలను అంతే ఆదరిస్తారని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం 17 సీట్లు గెలుచుకోవడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ తో బహిరంగంగానే చేతులు కలిపామని.. కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే రహస్యంగా చేతులు కలుపుతున్నాయని తెలిపారు.