నాకు ఓ గోవు ఇవ్వండి: ఓవైసీ

నాకు ఓ గోవు ఇవ్వండి: ఓవైసీ

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు తనకు కూడా ఓ గోవును ఇవ్వగలరా అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కోరారు. నిన్న హైదరాబాద్ లోజరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష గోవులను పంచుతామని ఆపార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్ ఇటీవల ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘వారు నాకు గోవును ఇస్తే దానిని పవిత్రంగా చూసుకుంటాను. వాళ్లు నాకు ఇవ్వగలరా?’’ అని ఓవైసీ ప్రశ్నించారు. కాగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గో మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.