ఇది పిరికిపందల చర్య: ఓవైసీ

ఇది పిరికిపందల చర్య: ఓవైసీ

వైసీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇది పిరికిపందల చర్యగా అభివర్ణించారు. వైఎస్‌ జగన్‌పై దాడి పూర్తిగా భద్రతా వైఫల్యమేనని ఆరోపించారు.

జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరగడం పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి హేయమైన చర్యకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ జగన్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే టీడీపీ ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.