బీజేపీ లక్ష్యం 'ముస్లిం ముక్త్ భారత్': ఒవైసీ

బీజేపీ లక్ష్యం 'ముస్లిం ముక్త్ భారత్': ఒవైసీ

మజ్లీస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'బీజేపీ ముస్లిం ముక్త్ భారత్' ను కోరుకుంటుందని, ఆ వర్గానికి చెందిన ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగించారు. హైదరాబాద్ లో జరిగిన ఓ సభలో ఆయన ప్రసంగిస్తూ బీజేపీ కాంగ్రెస్ రహిత భారత్ ను కోరుకోవడం లేదు. ముస్లిం రహిత భారత్ ను కోరుకుంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం ముస్లింలకు ఈ దేశంలో ఉండే హక్కు ఉంది అన్నారు. ఒవైసీ ప్రజలను రెచ్చగొట్టారంటూ రేపు టీవీ చానెళ్లు అదరగొడతాయని కూడా వ్యాఖ్యానించారు.