ఆస్ట్రాజెనేకా మూడో దశ ట్రైల్స్ మరి కొద్ది రోజుల్లో‌: ఆక్స్‌వర్డ్

ఆస్ట్రాజెనేకా మూడో దశ ట్రైల్స్  మరి కొద్ది రోజుల్లో‌: ఆక్స్‌వర్డ్

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాక్సిన్ చేసేందుకు ఎన్నో అగ్ర సంస్థలు పోటీపడుతున్నాయి. వాటిలో ఆక్స్‌వర్డ్ కూడా ఉంది. అయితే ఆక్స్‌వర్డ్ తన వ్యాక్సిన్ ఆస్ట్రాజెనేకాకు సంబంధించి కొత్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు విడుదల చేస్తోంది. ఇటీవల తన వ్యాక్సిన్‌కు సంబంధించింది రెండో దశ ట్రైల్స్‌ ముగిశాయని, అందులో పూర్తి ఆరోగ్యంగా ఉన్న 100 మంది వాలెంటీర్లు పాల్గొన్నారని తెలిపింది. అయితే రెండో దశ ట్రైల్స్‌కు కోవీషీల్డ్ అని పేరుపెట్టినట్లు చెప్పింది. అయితే వాలెంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చి 28 రోజులు దాటిన తరువాత మూడో దశ ప్రారంభం అవుతుందని ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ ట్రైల్స్‌ను కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్, బీవైఎల్ నైర్ హాస్పిటల్స్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపింది.  మూడో దశ ట్రైల్స్‌కు అనుమతి తీసుకునేందుకు రెండో దశ ట్రైల్స్ రిపోర్ట్‌లను డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డ్‌కు, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కన్‌ట్రోల్ ఆర్గనైజేఫన్‌కు పంపించనున్నట్లు చెప్పింది.

అనుమతి పొందిన వెంటనే మూడో దశ ట్రైల్స్‌ను మొదలుపెడతామని, రెండో ట్రైల్‌లోని మొదటి వాలెంటర్ గ్రూప్ వారి 28 రోజుల గడువు ముగించుకున్న తరువాతే వారికి మూడో దశ ట్రైల్స్‌ను నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఇన్‌డియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) నియమాల ప్రకారం 28 రోజుల గడువు దాటనిదే వ్యాక్సిన్ రెండో డోస్ ఇవ్వకూడదని బీఎమ్‌సీ అడిషనల్ కమీషనర్ సురేష్ కాకాని తెలిపారు. మొదటి గ్రూప్ వారి 28 రోజుల గడువు ముగిసిందని, మూడో దశ వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామనీ కాకాని అన్నారు.