వంటపాకలో ఉన్నప్పుడే మెగాస్టార్ గురించి చెప్పాడట

వంటపాకలో ఉన్నప్పుడే మెగాస్టార్ గురించి చెప్పాడట

ఇప్పుడు చిరంజీవి అంటే మెగాస్టార్ అని అర్ధం.  మెగాస్టార్ అంటే చిరంజీవి అనే అర్ధం.  నాలుగు దశాబ్దాల క్రితం చిరంజీవి హీరోగా చేసిన పునాదిరాళ్ళు సినిమాలో హీరోగా చేసిన సమయంలో నారాయణ మూర్తి జూనియర్ ఆర్టిస్ట్ గా చేశారట.  ఆ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరిగినప్పుడు జరిగిన ఓ సంఘటనను నారాయణమూర్తి నిన్న జరిగిన మార్కెట్లో ప్రజాస్వామ్యం సినిమా ఆడియో వేడుకలో గుర్తు చేసుకున్నారు.  

చిరంజీవి... నూతన ప్రసాద్... చంద్రమోహన్ లను రాజమండ్రిలో ఉన్న అప్సర లాడ్జిలో ఉంచారని, తనను కూడా అక్కడే ఉంచి మంచి భోజనం పెడతారని అనుకున్నానని అన్నారు.  కానీ, తనను వంటపాకలో ఉంచారని గుర్తు చేసుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి తనకు కంపెనీ ఇచ్చారని చెప్పారు.  చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ హీరో అవుతారని అప్పుడే చెప్పానని నారాయణమూర్తి గుర్తు చేసుకున్నారు.  తన సినిమా ఆడియో వేడుకకు వచ్చి సినిమా ప్రమోషన్లో భాగస్వామ్యం అయినందుకు చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేశారు.