టీడీపీకి ఎమ్మెల్యే రాజీనామా..!

టీడీపీకి ఎమ్మెల్యే రాజీనామా..!

సార్వత్రిక ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి జాబితా ఆ పార్టీలో చిచ్చుపెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని.. పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం స్థానాన్ని మరో వ్యక్తికి కేటాయించారు చంద్రబాబు. దీంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి. తనను కాదని టికెట్‌ ఇచ్చిన నేలపూడి స్టాలిన్ బాబుని ఓడించడమే తన టార్గెట్ అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు ప్రకటించారు పులపర్తి నారాయణమూర్తి. అయితే, ఆయన టీడీపీకి రాజీనామా చేసే మరో పార్టీలో చేరతారా? స్వతంత్రంగానే బరిలోకి దిగుతారా? అనే చర్చ నడుస్తోంది.