మల్టీస్టారర్ ను ప్లాన్ చేసిన రజిని దర్శకుడు

మల్టీస్టారర్ ను ప్లాన్ చేసిన రజిని దర్శకుడు

ఇటీవల కాలంలో మల్టీస్టారర్ సినిమాలు వరసగా వస్తున్నాయి.  సినిమా హిట్ కొడుతున్నాయి.  ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి.  తరువాత ఇప్పుడు మరలా ఆ సంస్కృతీ మొదలైంది.  ఒకప్పుడు మల్టీస్టారర్ సినిమాలంటే ఒక ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు కలిసి నటించేవారు.  

ఇప్పుడు అలా కాదు.  మల్టీ స్టారర్ సినిమాలంటే ఇతర ఇండస్ట్రీలకు చెందిన హీరోలతో కలిసి సినిమాలు చేస్తున్నారు.  దీంతో ఆయా ఇండస్ట్రీలలో కూడా సినిమాలు పాపులర్ అవుతున్నాయి.  రజినీకాంత్ తో కబాలి, కాలా సినిమాలకు దర్శకత్వం వహించిన పా రంజిత్ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతున్నది.  

బాహుబలి ఫేమ్ రానా, కోలీవుడ్ హీరో ఆర్యలతో పా రంజిత్ ఓ మూవీని ప్లాన్ చేశారు.  ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నట్టు సమాచారం.  ఈ సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు అన్నది త్వరలోనే తేలిపోతుంది.