పయ్యావులకు అస్వస్థత.. విజయవాడకు తరలింపు..

పయ్యావులకు అస్వస్థత.. విజయవాడకు తరలింపు..

అమరావతిలోని అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ సమావేశం జరిగింది.. సమావేశం కొనసాగుతుండగా పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అస్వస్థకు గురయ్యారు.. మొదట అసెంబ్లీలోని డిస్పెన్సరీలో పయ్యావులకు ప్రాథమిక చికిత్స అందించారు. ఫుడ్‌పాయిజన్ కావడంతోనే పయ్యావులకు స్వల్ప అస్వస్థతకు గురైనట్టు చెబుతున్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి పయ్యావులను తరలించారు అధికారులు. సెక్రటేరీయేట్ నుంచి 108లో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.