రివ్యూ : పడిపడిలేచే మనసు

రివ్యూ : పడిపడిలేచే మనసు

నటీనటులు : శర్వానంద్, సాయిపల్లవి, సునీల్, మురళీ శర్మ, ప్రియదర్శి తదితరులు 

సంగీతం : శేఖర్ చంద్ర 

ఫోటోగ్రఫి :  జయకృష్ణ 

నిర్మాత : చెరుకూరి సుధాకర్ 

దర్శకత్వం : హను రాఘవపూడి 

అందాల రాక్షసి,  కృష్ణగాడి వీర ప్రేమగాధ డిఫరెంట్ చిత్రాలతో ఆకట్టుకున్న హను రాఘవపూడి, ఇప్పుడు శర్వానంద్, సాయి పల్లవితో పడిపడిలేచే మనసు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ప్యూర్ లవ్ స్టోరీగా  తెరకెక్కిన ఈ సినిమా కోల్కతా నేపథ్యంలో సాగుతుంది.  ఈరోజు రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.  

కథ : 

శర్వానంద్ మొదటి చూపులోనే సాయి పల్లవిని ఇష్టపడతాడు.  ఆమె ప్రేమను వివిధ రకాలుగా ప్రయత్నిస్తాడు.  శర్వానంద్ చేసిన ప్రయత్నాలు ఆమెకు నచ్చుతాయి.  ఆ వెంటనే శర్వానంద్ ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది.  ఈ క్రమంలో పెళ్లి చేసుకుందాం అని చెప్తుంది సాయి పల్లవి.  పెళ్లి అనే సరికి శర్వానంద్ ఆలోచనలో పడతాడు.  డీప్ గా లవ్ చేసుకుంటున్నాం కాబట్టి అది అంతే డీప్ గా కంటిన్యూ అయితే పెళ్లి చేసుకుందాం అని చెప్తాడు.  దీంతో షాక్ తిన్న సాయి పల్లవి అతడికి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది.  అలా వెళ్లిన సాయి పల్లవిని శర్వానంద్ ఎలా కన్విన్స్ చేశాడు..? ఇద్దరు తిరిగి పెళ్లి చేసుకున్నారా లేదా అన్నది మిగతా కథ.  

విశ్లేషణ :  

ఫ్రెష్ లవ్ స్టోరీ.  మంచి పాయింట్ ను హను ఎంచుకున్నాడు.  పూర్తి స్థాయి లవ్ స్టోరీ కాబట్టి సినిమా ఎక్కువ భాగం శర్వానంద్, సాయి పల్లవిల చుట్టే తిరుగుతుంది.  నటనకు  స్కోప్ ఉన్న సినిమా కావడంతో.. శర్వానంద్, సాయి పల్లవి పోటీ పడి నటించారు.  శర్వానంద్.. సాయి పల్లవికి ప్రపోజ్ చేసినవిధానం .. ఆమెను ఇంప్రెస్ చేయడానికి చేసిన ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి.  లవ్ యాక్సెప్ట్ చేసిన తరువాత.. పెళ్లి దగ్గరికి వచ్చే సరికి శర్వానంద్ పెళ్ళికి ఒప్పుకోడు.   ఈ షాకింగ్ ట్విస్ట్ బాగుంది.  ఈ ట్విస్ట్ తరువాత సినిమాను ట్రీట్మెంట్ చేసిన విధానం లాజిక్కులు లేకుండా సాగుతుంది.   ఫస్ట్ హాఫ్ ను అద్భుతంగా ఆకట్టుకునే విధంగా తీసిన దర్శకుడు.. సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చే సరికి పట్టును కోల్పోయాడు.  లాజిక్కులు లేకుండా స్టోరీ నడుస్తుంది.  మెమరీ లాస్ తో స్టోరీ నడిపించాడు.  

నటీనటుల పనితీరు : 

ప్రేమకథ కావడంతో శర్వానంద్, సాయి పల్లవి ల చుట్టే కథ నడుస్తుంది కాబట్టి  ఇద్దరికీ ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా.  ఇద్దరు బాగా నటించారు.  మిగతా పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్ళేవే.  

సాంకేతిక వర్గం పనితీరు : 

హను రాఘవపూడి ఎంచుకున్న కథ బాగుంది.  దాని ట్రీట్మెంట్ విషయంలోనే తడబడ్డాడు.  ఫస్ట్ హాఫ్ వరకు సినిమాను అద్భుతంగా తీసిన దర్శకుడు సెకండ్ హాఫ్ విషయంలో ఆ ఫీల్ ను తీసుకురాలేకపోయాడు.  దీంతో సెకండ్ హాఫ్ బోరింగ్ అనిపిస్తుంది.  విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఆకట్టుకుంది.  జయకృష్ణ కెమెరా పనితనం మెచ్చుకునే విధంగా ఉంది.  

పాజిటివ్ పాయింట్స్ : 

శర్వానంద్, సాయి పల్లవి 

ఫస్ట్ హాఫ్ 

సంగీతం 

నెగెటివ్ పాయింట్స్ : 

సెకండ్ హాఫ్ 

చివరిగా : పడిపడిలేచే మనసు.. పడి లేవలేకపోయింది.