మంత్రి అనిల్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు...వ్యక్తి అరెస్ట్

మంత్రి అనిల్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు...వ్యక్తి అరెస్ట్

వరద సహాయకచర్యల్లో ప్రభుత్వం విఫలమైందనే కారణంతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పైనా, యాదవ కులంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు విజయవాడ పోలీసుల అదుపులో ఉన్నాడు. శేఖర్‌ ది గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం. ఇటీవల వరద సమయంలో రైతు వేషం కట్టి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నటించాడు శేఖర్‌. దీనిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కా  సీఎం వైఎస్‌ జగన్ గురించి అసభ్యంగా మాట్లాడుతూ, మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ కులాన్ని దూషిస్తూ శేఖర్‌ చేసిన వీడియోపై ప్రభుత్వ చీఫ్‌ డిజిటల్‌ డైరెక్టర్‌ డీజీపీ కి  ఫిర్యాదు చేశారు. దీంతో అతడ్ని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు పోలీసులు.