మొదటి దళిత రాష్ట్రపతి గుర్తులేరా..?

మొదటి దళిత రాష్ట్రపతి గుర్తులేరా..?

మొట్ట మొదటి దళిత రాష్ట్రపతి కె.ఆర్.నారాయణ్ ని నేతలు, ప్రభుత్వాలు మరిచిపోయాయి. ఆయన జయంతి రోజున కూడా గుర్తు చేసుకోలేని పరిస్థితి. చిన్న నేతల వర్థంతి, జయంతి రోజుల్లో ఫుల్ పేజి ప్రకటనలు ఇచ్చే ప్రభుత్వాలు రాష్ట్రపతిగా చేసిన గొప్ప దళిత నేత జయంతి రోజు ఎక్కడి చిన్న ప్రకటన కూడా ఇవ్వలేదని వినోద్ కే.జోషి నెటిజన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో పలువురు నెటిజన్లు ఔను నిజమే కదా అంటున్నారు. వారి కుటుంబ సభ్యులే ఓ పత్రికలో చిన్న ప్రకటన ఇచ్చారు. ప్రభుత్వాల తీరుపై నెటిజన్లు నిరసన తెలుపుతున్నారు.