చెత్తకుప్పలో రూ. 471 కోట్లు... పాతికేళ్లుగా అందులోనే... 

చెత్తకుప్పలో రూ. 471 కోట్లు... పాతికేళ్లుగా అందులోనే... 

ఎక్కడైనా వంద రెండు వందలు పెట్టి మర్చిపోతేనే ఎక్కడ పెట్టామా అని ఊరంతా వెతుక్కుంటాం.  దొరికే వరకు వెతుకుతాం.  అలనాటి ఒకటికాదు రెండు కాదు ఏకంగా రూ. 471 కోట్లు కనిపించకుండా పొతే... ఎక్కడ పెట్టారో తెలియకపోతే ఇంకేమైనా ఉందా.  రూ. 471 రూపాయలు కాదు, రూ. 471 కోట్ల రూపాయలు.  ఏంటి ఇవన్నీ డబ్బు రూపంలో ఉన్నాయని టెన్షన్ పడుతున్నారా ? అదేం లేదండి... అవి డబ్బుల రూపంలో లేవు.  ఆర్ట్స్ రూపంలో ఉన్నాయి.  1917 వ కాలానికి చెందిన గుస్తవ్ క్లిమ్స్ అనే పెయింటర్ గీసిన అమ్మాయి బొమ్మను అప్పట్లో ఇటలీలోని రిచ్చి ఆడి గ్యాలరీని సొంతం చేసుకుంది.  

అప్పటి నుంచి ఆ ఆర్ట్స్ గ్యాలరీ వద్దనే ఉన్న ఆ పెయింటింగ్ 1997 నుంచి కనిపించకుండా పోయింది.  ఎక్కడ పోయిందో తెలియక అధికారులు ఆందోళన చేశారు.  పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.  దీనికోసం అధికారులు వెతకడం మొదలుపెట్టారు.  అయితే, ఈ పెయింటింగ్ ఇటీవలే దొరికింది.  అది చెత్తకుప్పలో.  రిచ్చి ఆర్ట్ గ్యాలరీ పక్కన ఉన్న చెత్తకుప్పను ఓ స్వీపర్ క్లీన్ చేస్తుండగా ఆ పెయింటింగ్ దొరికింది.  అధికారులకు సమాచారం ఇచ్చారు.  పోయిందని అనుకుంటున్న ఈ ఫోటో దొరకడంతో సంతోషం వ్యక్తం చేశారు.  సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా, ఆ ఫోటోను సెంట్రల్ బ్యాంక్ లాకర్లో భద్రంగా దాచిపెట్టారట.