అటు పాక్.. ఇటు ఇండియా రికార్డులు..!! 

అటు పాక్.. ఇటు ఇండియా రికార్డులు..!! 

విశాఖలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇండియా విజయం దిశాగా దూసుకుపోతున్నది.  ఆట చివరిరోజు ఆరంభంలోనే ఇండియా బౌలర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు.  మ్యాచ్ ప్రారంభమైన రెండో ఓవర్లోనే అశ్విన్ దక్షిణాఫ్రికా ఓపెనర్ దిబ్రుయిన్ ను బౌల్డ్ చేశాడు.  ఆ తరువాత షమీ తరువాతి ఓవర్లోనే బువుమాను అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా 12 ఓవర్లో 20 రన్స్ చేసి మూడు కీలక వికెట్లు కోల్పోయింది.   దిబ్రుయిన్ ఔట్ చేయడం ద్వారా అశ్విన్ టెస్టుల్లో 350 వికెట్లు పడగొట్టాడు.  తక్కువ టెస్టుల్లో 350 వికెట్లు పడగొట్టిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు.  అంతకు ముందు శ్రీలంక బౌలర్ 66 టెస్టుల్లోనే ఈ రికార్డును సొంతం చేసుకోగా, అశ్విన్ కూడా 66 టెస్టుల్లో ఈ రికార్డును నెలకొల్పడం విశేషం.  

ఇక ఇదిలా ఉంటె, పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో మరో సంచలనం నమోదైంది.  పాకిస్తాన్లో పాక్.. శ్రీలంక జట్ల మధ్య టి 20 మ్యాచ్ లు జరుగుతున్నాయి.  లాహోర్ వేదికగా జరిగిన టి 20 మ్యాచ్ లో పాక్ యువ బౌలర్ హ్యాట్రిక్ సాధించాడు.  19 ఏళ్ల వయసులోనే హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్ గా ప్రపంచ రికార్డును సృష్టించాడు మహ్మద్.  ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లో 37 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఆ మూడు హ్యాట్రిక్ వికెట్లు కావడం విశేషం.