ఇమ్రాన్ పరువుతీసిన పాక్ ఆర్మీ చీఫ్..!!

ఇమ్రాన్ పరువుతీసిన పాక్ ఆర్మీ చీఫ్..!!

ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది.  రెండు దేశాల మధ్య దూరం పెరిగిపోయింది.  ఐరాసలో పాక్ ఇండియాపై విమర్శలు చేయడానికి సమయం మొత్తాన్ని వెచ్చించింది. దీంతో అంతర్జాతీయ సమాజం పాక్ పై బహిరంగంగా విమర్శలు చేశాయి.  పాక్ కు ఐరాసలో చైనా, టర్కీ, మలేషియా మినహా మరేదేశం కూడా మద్దతు ఇవ్వలేదు.  

అంతర్జాతీయంగా దౌత్యం నడిపించడంలో ఇమ్రాన్ ఖాన్ విఫలం అయ్యాడని పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.  అటు పాక్ ఆర్మీ కూడా ఇదే విధంగా మాట్లాడుతున్నది.  ఇదిలా ఉంటె, ఇమ్రాన్ ఖాన్ చైనాలో పర్యటించేందుకు ఈరోజు అక్కడికి చేరుకున్నాడు.  ఇమ్రాన్ తో పాటుగా పాక్ ఆర్మీ జనరల్ భజ్వా కూడా ఉన్నారు.  ప్రధానితో సైన్యాధ్యక్షుడు కలిసి విదేశీ పర్యటనకు వెళ్లడం అరుదుగా జరుగుతుంది.  చివరి నిమిషం వరకు ఇమ్రాన్ షెడ్యూల్ లో పాక్ జనరల్ పేరు లేదు.  చివరి నిమిషంలో బజ్వా పేరు చేర్చారు.  ప్రధానితో కలిసి బజ్వా వచ్చేందుకు పాక్ కు చైనా అనుమతి ఇచ్చింది.  అంతేకాదు, ఇమ్రాన్, జింపింగ్ సమావేశంలో బజ్వా కూడా పాల్గొంటున్నారు.  అంతర్జాతీయంగా దౌత్యం నడిపించడంలో ఇమ్రాన్ విఫలం అవుతున్నారని అందుకే ఇమ్రాన్ తో కలిసి బజ్వా కూడా వెళ్తున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.