వ్యాన్ డ్రైవర్ గా మారిన పాక్ క్రికెటర్.. ఇదే కారణం..

వ్యాన్ డ్రైవర్ గా మారిన పాక్ క్రికెటర్.. ఇదే కారణం..

పాకిస్తాన్ ప్రస్తుతం అప్పులతో సతమతమౌతున్నది.  పాక్ తో క్రికెట్ ఆడేందుకు ప్రపంచదేశాలు వెనకడుగు వేస్తున్నాయి.  క్రికెట్ ఆడే దేశాలు వెనకడుగు వేయడంతో పాపం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి మరీ అద్వాన్నంగా మారిపోయింది.  జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది.  ఇక పాక్ బోర్డు కొత్త విధానాన్ని తీసుకురావడంతో... ఈ విధానం ద్వారా కేవలం 200 మంది మాత్రమే లబ్ది పొందుతున్నారట.  

దీంతో చాలా మంది క్రికెటర్లు ఉపాధి కోసం వేరే వేరే రంగాల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.  ఇందులో భాగంగానే..  31 ఏళ్ల ఫజల్‌ సుభాన్‌  అనే క్రికెటర్ జీవనం కోసం డ్రైవర్ గా మారాడు.  ట్రక్ డ్రైవర్ గా మారి జీవనం సాధిస్తున్నాడు. తనకు క్రికెట్ అంటే ప్రాణం అని, జాతీయ జట్టుకు అడగాలని చాలా కృషిచేసినట్టు చెప్పాడు.  డిపార్టుమెంటల్ క్రికెట్ అదేసమయంలో ఆదాయం లక్ష రూపాయల వరకు ఉండేదని, కానీ, ఇప్పుడు ఆదాయం తగ్గిపోయిందని, చేసేది లేక ట్రక్ డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పారు.  ఈ ఉద్యోగం లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, మున్ముందు క్రికెటర్లు మరిన్నీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, అయన పేర్కొన్నారు.  కాగా, ఈ ట్రక్ డ్రైవర్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నది.